మరో ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల ఎకానమీకి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కెనరా బ్యాంక్ విజయవాడ బ్రాంచ్ డీజీఎం రవి సుధాకర్ అన్నారు. అనంతపురంలోని ఓ హోటల్లో కెనరా బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లకు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
అనంతలో కెనరా బ్యాంకు మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం - CANARA BANK
భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల సలహాలను కోరిందని కెనరా బ్యాంకు విజయవాడ బ్రాంచ్ డీజీఎం రవి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లకు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.
అనంతలో కెనరా బ్యాంకు మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం
దేశం ఎకానమీని పెంచేందుకు బ్యాంకుల సలహాను కేంద్రం కోరిందని డీజీఎం రవి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ల వారీగా... సమావేశాలు ఏర్పాటు చేసి బ్యాంకింగ్ పౌరులను కేంద్రీకృతం చేయటం, సీనియర్ సిటిజన్స్, రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, యువత, విద్యార్థులు. మహిళల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని వారి ఆర్థిక అభివృద్ధికి తగిన సూచనలను తెలుసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-"దేశం ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి"