అనంతపురం జిల్లా హిందూపురంలో పెను ప్రమాదం తప్పింది. 40 మహిళా కార్మికులతో బయలు దేరిన బస్సు చెరువు నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు మహిళలను రక్షించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిందూపురంలో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముూడు రోజులుగా హిందూపురం, అనంతపురం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ రోజు వరద ప్రవాహం తగ్గడంతో కొట్నూరు నుంచి 40 మంది మహిళలు ప్రయాణం సాగించారు. అయితే కొట్నూరు చెరువు నీటి ప్రవాహానికి బస్సు నీటి కుంట వైపు ఒరిగింది. గమనించిన స్థానికులు హుటాహుటిన బస్సు వద్దకు చేరుకోని మహిళ కార్మికులను రక్షించారు. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు రాకపోకలను నిషేధించాలని స్థానికులు కోరుతున్నారు.
తప్పిన పెను ప్రమాదం...40 మంది మహిళలు సురక్షితం - అనంతపురం జిల్లాలో చెరువులో పడ్డ బస్సు
40 మంది మహిళా కార్మికులతో బయలు దేరిన బస్సు చెరువులో చిక్కుకున్న ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. వారిని గమనించిన స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
తప్పిన పెను ప్రమాదం