Chitravathi Reservoir అనంతపురం జిల్లాలోని చిత్రావతి జలాశయంలో నీటి నిల్వ గరిష్టస్థాయికి చేరటంతో గేట్లు తెరిచి కడప జిల్లాకు విడుదల చేశారు. నది ప్రవాహం యల్లనూరు మండలం మల్లేపల్లి మీదుగా వెళుతుంది. గత ఏడాది నవంబర్లో సైతం భారీ వర్షాలతో చిత్రావతికి పెద్దఎత్తున వరద వచ్చింది. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మల్లేపల్లి వద్ద చిత్రావతి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఆ ఘటనలో యల్లనూరు-తాడిపత్రి మధ్య రాకపోకలు స్తంభించాయి. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్పట్లో మట్టి వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. మళ్లీ ప్రవాహం రావటంతో మట్టి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో యల్లనూరు మండలంలోని దాదాపు 20 గ్రామాలకు తాడిపత్రితో రాకపోకలు నిలిచిపోయాయి.
రెండోసారి కొట్టుకుపోయిన వంతెన, రాకపోకలకు అంతరాయం - bridge broken in Yallanur mandal
Chitravati river అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో వంతెన తెగిపోయింది. చిత్రావతి జలాశయంలో నీటి నిల్వ గరిష్ఠస్థాయికి చేరటంతో గేట్లు తెరిచి నీరు విడుదల చేశారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మల్లేపల్లి వద్ద చిత్రావతి నదిపై ఉన్న వంతెన కొట్టుకపోయింది. దీంతో యల్లనూరులోని దాదాపు 20 గ్రామాలకు తాడిపత్రితో రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాది నుంచి వంతెన నిర్మాణం గురించి ఎమ్మెల్యేకు విన్నపాలు చేస్తున్నా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో వంతెన తెగిపోయింది
ఏడాది కాలంగా ఈ వంతెన నిర్మాణం గురించి ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనుల కోసం తాడిపత్రి వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: