అనంతపురం జిల్లా నంబలపూలకుంటకు చెందిన జాఫర్ కుమారుడు సిద్ధిక్ (9) ఊయలతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు తాడు చుట్టుకుని ఊపిరి ఆడక మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు సిద్ధిక్ ఆదివారం ఇంటి వద్ద ఊయల ఆడుకుంటుండగా తాడు చుట్టుకుని ఊపిరి ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆరోగ్య ఉపకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవటంతో 108 వాహనంలో కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో బాలుడిని మృత దేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.ఈవిషయమై నంబులకుంట పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
విషాదం: ఊయల తాడే ఊపిరి తీసింది... - ananthapuram crime news
తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడిని ఊయల రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో జరిగింది.
మృతి చెందిన సిద్ధిక్