ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసి ఫలాలు అందిస్తాం: బొత్స - botsa satyanarayana Latest News

రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేసి ఫలాలు అందిస్తామని.. అనంతపురం జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. గతంలో నిర్ణయించిన 800 కోట్ల రూపాయలతోనే తాము నాలుగు ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో 75వేల ఎకరాలకు సాగునీరొస్తుందని మంత్రి బొత్స వివరించారు.

botsa satyanarayana Participate in Projects Launch
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Dec 9, 2020, 7:07 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

భూమిపూజ చేసిన ఈ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేసి ఫలాలు అందిస్తామని అనంతపురం జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లాలో కొత్తగా నిర్మించనున్న మూడు జలాశయాలను సీకే పల్లి మండలం వెంకటాంపల్లి సభ వద్ద ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి వీక్షణ సమావేశం ద్వారా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు జలాశయాల నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయటానికే రూ.16 కోట్లు ఖర్చుచేసి, పనులు మాత్రం చేయలేదన్నారు. గతంలో నిర్ణయించిన 800 కోట్ల రూపాయలతోనే తాము నాలుగు ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో 75వేల ఎకరాలకు సాగునీరొస్తుందని మంత్రి బొత్స అన్నారు. ప్రతి ఇంటా సిరులు కురిపించేలా పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు చెప్పారు. ఈ నాలుగు జలాశయాలు అందుబాటులోకి వస్తే ఐదు వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్ష ఉపాధి దొరకనుందని తెలిపారు. ప్రస్తుతం 12 మత్స్యకార సహకార సంఘాలుండగా... భవిష్యత్​లో ఈ నియోజకవర్గంలో మరో 40 సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎగువ పెన్నార్ జలాశయానికి వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ రిజర్వాయర్​గా పేరు పెడుతూ.. వీక్షణ సమావేశంలో సీఎం జగన్ జీవోను విడుదల చేశారు.

ఇదీ చదవండీ... హంద్రీనీవా సుజల స్రవంతితో అనంతపురం జిల్లా సస్యశ్యామలం: జగన్

ABOUT THE AUTHOR

...view details