అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులకు బీజేవైఎం నాయకులు ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేశారు. భాజపా పిలుపు మేరకు సేవాహి సంఘటన్ అనే నినాదంతో పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసినట్లు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల వెంకటేష్ చెప్పారు. కర్ఫ్యూ కారణంగా ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని తాము గుర్తించినట్లు చెప్పారు. తమ వంతు సాయంగా వాటిని అందించామన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరోనా బాధితులకు పండ్లు పంపిణీ - guntakallu govt hospital news
కరోనా వేళ బీజేవైఎం నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. అయిన వారే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో వారు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు పండ్లు , ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
బీజేవైఎం కరోనా బాధితులకు పండ్లు పంపిణీ