ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయం: భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అనంతపురంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని...హోదాపై కాకుండా ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచించారు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. . వైకాపా ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే అంశంతో ప్రజలను మభ్య పెట్టకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన హితవు పలికారు. అనంతపురంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాకు మించిన నిధులను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని సురేష్ రెడ్డి తెలిపారు. జిల్లా నాయకులు... సురేష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.