ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిగా అమరావతిని కొనసాగించడమే భాజాపా నినాదం - హిందూపురం భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

రాజధానిగా అమరావతిని కొనసాగించడమే భాజాపా నినాదమని పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో హిందూపురం భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు.

bjp leaders rally at anantapur
కదిరిలో భాజాపార్యాలీ

By

Published : Jan 31, 2020, 9:55 AM IST

కదిరిలో భాజపా ర్యాలీ

అనంతపురం జిల్లా కదిరిలో భాజపా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ హాజరయ్యారు. వైకాపా, తెదేపాలు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి అవినీతిలో పోటీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. సీఏఏతో భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని సత్యకుమార్ గుర్తు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు భాజాపా నాయకులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details