అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో భాజపా, జనసేన పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలు నిర్వహించనున్నారు. మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తుతో బరిలో దిగుతామని భాజపా జిల్లా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న ఏకైక నిర్ణయంతో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తుతో అన్ని నియోజకవర్గాలు, మండలాల వారీగా స్థానిక ఎన్నికల్లో గెలుపొందడంతో పాటు ...పార్టీలను బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యమని వారు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికలకు 'భాజపా- జనసేన పొత్తు'
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో భాజపా- జనసేన పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తుతో గెలుపొంది.. పార్టీలను బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు జిల్లా భాజపా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తు