పెట్రోల్ లీకేజీ కారణంగా ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా(Anantapur district) గోరంట్లలో జరిగింది. బాచన్నపల్లి గ్రామానికి చెందిన నరేష్ తన సోదరుడి వివాహ పత్రికలు పంచడానికి ఉదయం ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. మార్గమధ్యలో పెట్రోల్ అయిపోవడంతో గోరంట్లలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఫుల్ ట్యాంక్ చేయించాడు. అనంతరం అక్కడి నుంచి బయలదేరి ఒకచోట నిలిపి.. ఆ తరువాత స్టాట్ చేయగానే ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు, ద్విచక్ర వాహనదారుడు మంటలు అదుపు చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా.. మంటలు అదుపులోకి రాకపోవటంతో ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైందని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
fire: పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాడు.. ఒక్క కిక్‌తో అంతా.. - గోరంట్లలో బైక్ దగ్ధం వార్తలు
పెట్రోల్ ధరలు చుక్కలనంటుతున్నాయి.. అయినప్పటికీ ఫుల్ ట్యాంక్ చేయించాడు. ఆ తర్వాత బండి స్టార్ట్ చేసేందుకు కిక్ కొట్టాడు.. అంతే అప్పుడు జరిగిన సంఘటనతో అతను షాక్‌కు గురయ్యాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి..
fire