ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 25న భారత్​ బంద్​' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఈ నెల 25న భారత్​ బంద్​ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Sep 1, 2021, 3:30 PM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 19 రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 25న భారత్ బంద్ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. కొత్తగా తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదన్నారు.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం నీటి పంపకాలు చేయాలి, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ తప్పుడు పద్దతిలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.

రాజధాని విషయంలో సీఎం జగన్​ అనాలోచిత నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రూ.4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదన్నారు.

ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు పింఛన్లు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం దివాళాకోరు ఆలోచనలతో పేదల పొట్ట కొడుతున్నారన్నారు. ప్రజలు, ఉద్యోగుల్లో ఈ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

ఇదీ చదవండి:RRR: 'సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణం'

ABOUT THE AUTHOR

...view details