విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి శ్రీభరత్, భీమిలి అభ్యర్థి సబ్బంహరితో కలిసి నందమూరి బాలకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తెదేపానే గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భీమిలి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన హుషారుగా ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బైక్ ర్యాలీ ద్వారా ఘనస్వాగతం పలికారు.
భీమిలిలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం - ఎన్నికల
విశాఖ జిల్లా భీమిలిలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. భీమిలి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రచార రథంపై రోడ్‌షోలో పాల్గొన్నారు.
బాలకృష్ణ ఎన్నికల ప్రచారం