ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుకొండలో రోడ్డు ప్రమాదం.. 7గురికి గాయాలు - పెనుకొండ

పెనుకొండలో ద్విచక్ర వాహనం-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయలయ్యాయి. ఘటన సమయంలో ఆటోలో 5గురు ప్రయాణికులు ఉండగా... ద్వి చక్ర వాహనంపై ఇద్దరు ఉన్నారు.

'పెనుకొండలో ద్విచక్ర వాహనం-ఆటో ఢీ.. 7గురికి గాయాలు'

By

Published : May 18, 2019, 7:20 PM IST

'పెనుకొండలో రోడ్డు ప్రమాదం.. 7గురికి గాయాలు'

అనంతపురం జిల్లా పెనుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోని ఐదుగురికి, ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పెనుకొండలో గృహ నిర్మాణ పనులకోసం రొద్దం మండలం బూచెర్ల నుంచి ఆటోలో ఐదుగురు వ్యక్తులు వస్తున్నారు. అదే సమయంలో.. పెనుకొండకే చెందిన ఇద్దరు యువకులు ద్వి చక్రవాహనంపై వెళుతుండగా రెండూ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details