అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సాయినగర్‌లో మద్యం షాపు వద్దంటూ మహిళల అందోళనకు దిగారు. సమీపంలోని పాలడైరీ పక్కన మద్యం షాపు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ మహిళలు మూకుమ్మడిగా మద్యం షాపు దుకాణం ఏర్పాటు వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్మాణంలో ఉన్న గదిని ధ్వంసం చేశారు. తమ కాలనీలో ఎట్టి పరిస్థితిలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఆందోళన చేపట్టారు. మహిళలందరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మద్యం షాపు వద్దంటూ..మహిళల అందోళన - నిరసన
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సాయినగర్‌లో మద్యం షాపు వద్దంటూ మహిళలు ఆందోళనకు దిగారు. నూతనంగా నిర్మిస్తున్న షాపు గదిని ధ్వంసం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
మద్యం షాపు వద్దంటూ..మహిళల అందోళన