అనంతపురంలో ఎ.ఆర్ ఎస్సై నజీర్... చీటీల పేరుతో ఖాకీలకే కుచ్చుటోపీ పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా చీటీలు వేస్తూ వచ్చిన నజీర్ ఓ రిటైర్డ్ ఎస్సై విషయంలో ప్లేటు ఫిరాయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టడంతో బాధితుల సంఖ్య పెరిగింది. వెంటనే నజీర్ ను అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
చీటీల పేరుతో ఎ.ఆర్ ఎస్సై మోసం.. కేసు నమోదు - అనంతపురం జిల్లా తాజా వార్తలు
చీటీల పేరుతో ప్రజలను మోసం చేసే నాయకులను చూశాం. గల్లీ లీడర్లను చూశాము. అలా మోసపోయిన వారు పోలీసులను సంప్రదిస్తారు. కానీ పోలీసులే చీటీల పేరుతో మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి... ఇలాంటి సంఘటనే అనంతపురంలో చోటుచేసుకుంది.
చీటీల పేరుతో ఎ.ఆర్ ఎస్సై మోసం
ఇదీ చదవండి: