ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 19, 2022, 6:59 PM IST

  • ఏపీలో పెరిగిన అప్పులు.. వివరాలు బయటపెట్టిన కేంద్రం
    AP DEBTS : రాష్ట్రంలో అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం నివేదించింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'నా మాట శాసనం అన్న పవన్.. శాసనసభ గేటును తాకలేకపోయారు'
    MINISTERS FIRES ON PAWAN KALYAN : జనసేన అధినేత పవన్‌పై మంత్రులు జోగి రమేష్​, రోజా విరుచుకుపడ్డారు. జగన్‌ను దించడం కాదు కదా.. వైసీపీని ఇంచు కూడా కదిలించలేరన్నారు. పార్ట్‌ టైం రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టాలని సవాల్‌ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి రైతుల ఉద్యమానికి భారతీయ కిసాన్ సంఘ్​ మద్దతు
    Bharatiya Kisan Sangh Support to Amaravti Farmers: అమరావతి రైతుల పోరుబాటకు.. భారతీయ కిసాన్ సంఘ్ మద్దతు ప్రకటించింది. ఇవాళ దిల్లీలో జరిగిన కిసాన్ గర్జనలో అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ వేదికపై న్యాయబద్దంగా పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని.. బీకేఎస్ నేతలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనంతపురంలో సీపీఐ కలెక్టరేట్​ ముట్టడి.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
    CPI Dharna: రైతు సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. దిగుబడి రాని పత్తి మొక్కలతో రైతులు, సీపీఐ నేతలు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలు బారికేడ్లు తోసేసి.. గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.500కే వంట గ్యాస్​ సిలిండర్.. వారందరికీ సీఎం వరం
    LPG price cut news : పేద ప్రజలకు భారీ వరం ప్రకటించింది రాజస్థాన్​ ప్రభుత్వం. వంట గ్యాస్​ సిలిండర్​ను రూ.500కే అందించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్​ 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ.. భారీగా మంటలు.. ముగ్గురికి గాయాలు
    సూరత్‌లో ఓ కిరాణ దుకాణంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కిరాణ దుకాణంలో ఉండే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చారిత్రక 'జీవవైవిధ్య' ఒప్పందానికి పచ్చజెండా.. ఆ దేశాలకు భారీగా ఆర్థిక సాయం
    జీవవైవిధ్య పరిరక్షణ దిశగా కీలక ముందడుగు పడింది. ఐరాస జీవవైవిధ్య సదస్సులో కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడే పేద దేశాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లభించేలా ఒప్పందాన్ని రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వ్యక్తిగత రుణమా.. హౌసింగ్ లోనా?.. ఏది ముందు తీర్చేయాలి?
    ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం వల్ల గృహరుణాల రేట్లు పెరగడం ప్రారంభించాయి. ఇప్పటికే అనేక బ్యాంకులు తమ రెపో ఆధారిత రుణాల రేట్లను సవరించాయి. దీంతో చాలామందికి రుణ వ్యవధి ఒక్కసారిగా మారిపోయింది. 20 ఏళ్లకు తీసుకున్న రుణం.. తీరేందుకు 27-28 ఏళ్లు పడుతోంది. అందుకే రుణగ్రహీతలు సాధ్యమైనంత వేగంగా ఇంటి రుణం తీర్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇంటి రుణంతోపాటు, వాహన, వ్యక్తిగత రుణాలు ఉన్న వారు దేన్ని ముందు తీర్చాలనే సందేహంతో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాక్​ కెప్టెన్​కు చేదు అనుభవం.. గంటపాటు మ్యాచ్​ ఆడకుండా నిరసన!
    పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఇంగ్లాండ్​తో జరుగుతున్నటెస్టు మ్యాచ్​​ రెండో రోజున గంటపాటు మైదానంలోకి రాకుండా నిరసన తెలిపాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అవతార్-2' వసూళ్ల సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.3,500 కోట్లకుపైగా..!
    Avatar 2 First Weekend Collections: 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమా మొదటి వారాంతంలో దాదాపు రూ.3500 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా రోజుకు రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తోందన్న మాట!. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details