అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మలక వేముల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం దగ్ధమైంది. పట్నం గ్రామానికి చెందిన అశోక్ ముదిగుబ్బ వెళ్తుండగా వాహనం ఇంజన్ వేడెక్కింది. రహదారి పక్కన నిలపటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భయపడిన యువకుడు అక్కడి నుంచి దూరంగా వచ్చాడు. నిమిషాల వ్యవధిలో వాహనం కాలిపోయింది. ఎండలో వాహనాన్ని నడపటం వల్ల ఇంజన్ వేడెక్కి బైక్ కాలిపోయినట్టు బాధితుడు వాపోయాడు.
మండుతున్న ఎండలు.. ద్విచక్రవాహనం దగ్ధం - anantapur
ఎండవేడికి ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. అనంతపురం జిల్లా మలక వేముల వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
బైక్ దగ్ధం