అనంతపురం జిల్లా కటారుపల్లిలో వేమన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 3రోజులపాటు జరిగే వేడుకల్లో వినూతన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, ఎడ్ల బండ్ల పోటీలు చేపట్టారు. వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైన పోటీ ఉట్ల తిరుణాల.
యువతలో ఐక్యత చాటేందుకు ఈ ఉట్ల తిరుణాల నిర్వహిస్తారు. ఎత్తైన స్తంభంపైన ఉంచిన బహుమతి సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడతారు.
ఉట్ల తిరుణాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువకులు బహుమతి కోసం ఉత్సాహం చూపిస్తారు. ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచేవారు కొందరైతే... ప్రత్యర్థి వర్గం... నీళ్లు చల్లి ఆటంకం కలిగిస్తుంటుంది. ఇలా సరదాగా సాగే వేడుక అందరినీ అలరిస్తుంది. ఆటంకాలు లెక్క చేయకుండా స్తంభంపైకి ఎక్కి బహిమతి పట్టుకున్న వ్యక్తులకు ప్రత్యేక బహుమతి ఇస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
కొయ్య మీద బహుమతి కోసం యువకుల పోటీ - atp
ప్రజాకవి యోగివేమన జీవ సమాధి అయిన అనంతపురం జిల్లా కటారుపల్లి లో వేమన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
ఉట్ల తిరుణాల