ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధ్యాయుడి ఎన్నికల ప్రచారంపై చర్యలేవీ..?

గోరంట్లలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడంలేదని.. కిందిస్థాయి అధికారులు అధికార పార్టీకి తలొగ్గి పనిచేస్తున్నారని.. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

Any action on teacher election campaign
ఉపాధ్యాయుడి ఎన్నికల ప్రచారంపై చర్యలేవీ..?

By

Published : Feb 17, 2021, 1:59 PM IST

అనంతపురం జిల్లా గోరంట్లలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడంలేదని.. కిందిస్థాయి అధికారులు అధికార పార్టీకి తలొగ్గి పనిచేస్తున్నారని.. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగేనాయక్‌ భార్యను గోరంట్ల సర్పంచి బరిలో అధికార పార్టీ మద్దతుతో పోటీలో దింపి.. ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం,. కేసు నమోదు చేశామన్నారు. తర్వాత ఏం చేశారో చెప్పలేదు. సరైన చర్యలు తీసుకుని ఉంటే నామినేషన్‌, ప్రచారాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు.

నామినేషన్‌ వేసిన రోజు మంత్రితో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి సిరగంవాండ్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీడియోలు, చిత్రాలు తీసి ఎన్నికల కమిషన్‌, జిల్లా కలెక్టర్‌, మండల ఆర్వో, ఏఆర్వోలకు పంపామన్నారు. ఆ గ్రామస్థులే వీడియో తీసి పంపారని, అయినా చర్యలు తీసుకొంటారన్న నమ్మకం లేదన్నారు. నాయకుడు వడ్డె నాగరాజు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ABOUT THE AUTHOR

...view details