తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపుమేరకు వైకాపా బాధితులు అమరావతి పయనమవుతున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని ఎర్రగొండపాలెం గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఆరుగురు తెదేపా కార్యకర్తలకు చెందిన దానిమ్మ తోటను.. ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన చంద్రబాబు స్థానిక నేతలతో మాట్లాడారు. బాధితులను అమరావతి రావాల్సిందిగా కోరారు. చంద్రబాబు పిలుపు మేరకు స్థానిక నేతలు, నష్టపోయిన రైతులు హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. వారందరూ మంగళవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలుసుకోనున్నారు. అనంతరం ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
అమరావతికి అనంత రైతులు... చంద్రబాబుతో సమావేశానికి పయనం - farmers
తెదేపా అధినేత చంద్రబాబును కలుసుకునేందుకు అనంతరం జిల్లా తెదేపా నేతలు అమరావతి బయలుదేరారు. పార్టీకి చెందిన కల్యాణదుర్గం రైతు ఆవులప్ప దానిమ్మ తోటను వైకాపా నేతలు ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు.. తమను అమరావతికి రమ్మన్నారని వారు తెలిపారు.
అమరావతి అనంత రైతులు... మంగళవారం చంద్రబాబుతో సమావేశం