పెనుకొండ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన జీఎం - పెనుకొండ
అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వేస్టేషన్‌ను హుబ్లీ డివిజన్ దక్షిణమధ్య రైల్వే జీఎం అజయ్ కుమార్ సింగ్ సందర్శించారు.
ananthapuram_penukonda _visit_railway_gm
పెనుకొండ రైల్వేస్టేషన్‌లోని మౌలిక సదుపాయాల గురించి హుబ్లీ డివిజన్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అజయ్ కుమార్ సింగ్ ఆరా తీశారు. బెంగళూరు నుంచి గుంతకల్ వరకు జరుగుతున్న రెండో ట్రాక్ పనులను పరిశీలించారు. స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. పనులను వేగవంతగా చేయాలని పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. స్టేషన్ ఆవరణంలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రంగా ఉంచాలన్నారు.