విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠా(international red sandal smugglers)ను.. అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. చిలమత్తూరు మార్గంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప తెలిపారు. 19 మందిని అరెస్టు చేసి, 3305 కిలోల బరువున్న 165 ఎర్రచందనం దుంగలను, ఐదు వాహనాలను, 19 చరవాణీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ దుంగల విలువ రూ.1.50 కోట్లు ఉంటుందన్నారు.
ఎర్రచందనం రవాణా ముఠా కడప - చిత్తూరు జిల్లాల నుంచి దుంగలను సేకరించి.. తమిళనాడు గోదాముల్లో నిల్వ చేస్తారని ఎస్పీ తెలిపారు. అక్కడినుంచి శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు అక్రమ రవాణా చేస్తూ విదేశాలకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. దుబాయ్ కేంద్రంగా ఈ తంతు సాగుతున్నట్లు తెలుస్తోందన్నారు. నిందితులలో తమిళనాడుకు చెందిన 8 మంది, కడపకు చెందిన ఐదుగురు, చిత్తూరుకు చెందిన ఆరుగురు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారన్నారు. ప్రధాన నిందితులైన బిలాల్, సాహుల్ సమీద్ (సాహుల్ బాయ్), వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితులే ఈ వ్యవహారానికి సూత్రధారులని.. వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను డీఐజీ, డీజీపీలు అభినందించినట్లు ఎస్పీ చెప్పారు.
Arrest: భారీగా ఎర్రచందనం పట్టివేత.. అంతర్జాతీయ రవాణా ముఠా అరెస్టు..
విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠా 19 మందిని అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చిలమత్తూరు మార్గంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను పట్టుకుని వారి వద్ద ఉన్న 165 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.50కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు