సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పూర్తి చేసుకున్న ఈవీఎంలను.. అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలకు తరలించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు చెందిన ఈవీఎంలను.. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్టు కలెక్టర్, ఎన్నికల అధికారి వీరపాండియన్ చెప్పారు. ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ వేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్టు వివరించారు.
జేఎన్టీయూ, ఎస్కేయూలకు అనంత ఈవీఎంలు - ఎస్కేయూ
అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు చెందిన ఈవీఎంలను... జేఎన్టీయూ, ఎస్కేయూలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు.
జేఎన్టీయూ, ఎస్కేయూలకు అనంత ఈవీఎంలు
Last Updated : May 31, 2019, 3:17 PM IST