అనంతపురం జిల్లాలో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న హరినాథ్ గత ఏడాది ఫిబ్రవరిలో మృతి చెందారు. జిల్లా ఎస్పీ.. భద్రత ఎక్స్ గ్రేషియా మొత్తం రూ. 3,80,500 చెక్కు రూపంలో మృతుడి భార్య లక్ష్మీకి అందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్ నాథ్ , జాఫర్ , సుధాకర్ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.3,80,500 ఎక్స్‌గ్రేషియా - అనంతపురం పోలీసుల వార్తలు
అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కొల్పోయిన హరినాథ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు రూ.3,80,50 ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.3,80,500 ఎక్స్‌గ్రేషియా