మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని.. బాధితులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు భరోసా ఇచ్చారు. తిరుపతిలో ప్రస్తుతం జరుగుతున్న 63 వ ఏపీ పోలీస్ రాష్ట్ర స్థాయి మొట్ట మొదటి డ్యూటీ మీట్లో భాగంగా" మహిళలపై సైబర్ నేరాలు" అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు.
పరువు పోతుందనే భావనతో సాధారణంగా మహిళలు ఇటువంటి ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడానికి సంకోచిస్తుంటారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నితమైన విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ప్రస్తుతం కొందరు మహిళలు, బాలికలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని.. బాధితులుగా మారకుండా ఉండేందుకు సైబర్ హైజీన్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.