నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందంటూ అనంతపురంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Anantapur: జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడి - అనంతపురం సమాచారం
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా అనంతపురంలో నిరుద్యోగులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.
ధర్నా
ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. రానున్న కాలంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని విద్యార్థి యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.