ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ ఇంట్లోని చెత్తనూ... సద్వినియోగం చేసుకోవచ్చు!

మీ ఇంట్లో నిత్యం వచ్చే చెత్తను సైతం సద్వినియోగం చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకోవాలంటే... కదిరి వెళ్లాల్సిందే! అక్కడి హోం కంపోస్ట్ అందరినీ ఆలోచింప చేస్తోంది.

మున్సిపల్ శాఖ అధికారులు

By

Published : Jul 18, 2019, 10:43 PM IST

మున్సిపల్ కమిషనర్ ప్రమీల

చెత్త నుంచి ఎరువును తయారు చేసుకుని పెరటి మొక్కలకు అందించే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో ఇంటిలోనే ఎరువు(హోమ్ కంపోస్ట్) ను తయారు చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో చురుగ్గా వ్యవహరించే మహిళలను ఎంపిక చేసుకుని... వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. తమ సంఘాల పరిధిలోని సభ్యులందరికీ... శిక్షణ పొందిన మహిళలు ఎరువు తయారీ విధానంపై అవగాహన కల్పిస్తారు. వార్డు స్థాయిలో మహిళలకు ఇంటిలోని చెత్త ద్వారా ఎరువును తయారు చేసుకునే విధానాన్ని తెలియజేస్తారు. ఇందుకు అవసరమైన సామగ్రిని మున్సిపల్ అధికారులే సరఫరా చేస్తారు. పట్టణాన్ని విభాగాలుగా చేసి ఇంటి ఎరువును తయారుచేసే మహిళలకు అవగాహన కల్పించేందుకు పర్యావరణ మిత్రలను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఈ విధానాన్ని పట్టణంలోని 36 వార్డుల్లో అమలు చేస్తామని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details