కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అనంతపురంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంత్రి శంకరనారాయణతో కలిసి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కొవిడ్ 19 విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యసదుపాయాలు, టెస్టులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 2 కోట్ల నిధులు కేటాయించిందని.. అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'అప్రమత్తంగా ఉన్నాం... ఆందోళన వద్దు' - అనంతపురం కరోనా వార్తలు
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి