ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంటింటికి రేషన్​ పంపిణీకి 754 వాహనాలు సిద్ధం '

ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్​ బియ్యం పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు తెలిపారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా 754 వాహనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

By

Published : Jan 20, 2021, 7:14 PM IST

ananta collector
'ఇంటింటికి రేషన్​ పంపిణీకి 754 వాహనాలు సిద్ధం '

ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 754 మొబైల్ డిస్పేస్ యూనిట్లను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కలెక్టరేట్​లోని రెవెన్యూ భవన్​లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు, హెల్పర్ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సభ్యులను ఎంపిక చేసి, వారి కుటుంబాలకు ఉపాధి కల్పించామన్నారు.

జిల్లాలో 3012 రేషన్ దుకాణాలు, 11 లక్షల 76 వేల 522 రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 21న మంత్రి ఆధ్వర్యంలో వాహనాల ట్రయల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఒకటో తేదీ వరకు వాహనాల ద్వారా ట్రయల్​ నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వర్గీయుల నిరసన

ABOUT THE AUTHOR

...view details