'మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయండి' - AISF demands afternoonmeals
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్మవరం పట్టణంలో పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నుంచి విద్యార్థులు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు కళాశాలకు ఇవ్వకుండా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అమలు చేయాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్నిఆర్డీఓ తిప్పే నాయక్ కు అందజేశారు.