ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు - అనంతపురం

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరుగుతోందని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీఎన్​వీ ప్రసాద్ అన్నారు. పెరుగుతున్న చిరు ధాన్యాల సాగుకు అనుగుణంగా ప్రాసెసింగ్ కేంద్రాలను పెంచనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.

agriculture_millets_cultvation_in_ananthapur

By

Published : Jun 2, 2019, 12:53 PM IST

రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని చిరుధాన్యాల ప్రొసెసింగ్ కేంద్రాలను ఆత్మ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ బీఎన్​వీ ప్రసాద్ పరిశీలించారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా అన్నదాతకు నష్టాలను తగ్గించే కార్యాచరణను చేపట్టనున్నట్లు తెలిపారు. తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు ద్వారా నికర ఆదాయం వచ్చేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ తరహా సాగు చేస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకునేలా మిగతా రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details