అనంతపురం జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ ఢీ కొనడంతో భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓబులేసు అతని భార్య నాగవేణి టీవీఎస్ ఎక్స్ ఎల్ వాహనంలో ఉదయం పెన్నహోబిళం వద్ద కూలిపనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా... అనంతపురం రహదారిలో ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారిని ఢీకొంది. ఈప్రమాదంలో భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనే లోపే ఈసంఘటన జరగడం విషాదాన్ని నింపింది
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు...భార్యభర్త మృతి - husband
కూలి పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగివస్తుండగా... ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని భార్యభర్తలు మృతి అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు...భార్యభర్తలు మృతి