అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతిచెందగా...ఇద్దరికి గాయాలయ్యాయి. మల్కాపురానికి చెందిన ఆదెప్ప, ముత్యాలప్ప ధర్మవరం వచ్చి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే మరో ద్విచక్రవాహనంపై వస్తున్న హోంగార్డును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆదెప్ప మృతిచెందాడు. ముత్యాలప్ప, హోంగార్డు అనంతరెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - anantapur
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదం