కదులుతున్న రైలులో నుంచి దిగబోయి ఓ యువకుడు తీవ్రగాయాల పాలైన ఘటన అనంత జిల్లా జక్కల చెరువు గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడి కాళ్లు విరిగినట్ల అధికార్లు తెలిపారు. తాడిపత్రికి చెందిన నిరంజన్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. గత రాత్రి తాడిపత్రికి వెళ్లేందుకు తిరుపతి-విజయవాడ ఎక్సెప్రెస్ రైలు ఎక్కాడు. నిద్ర మత్తులో తాడిపత్రి స్టేజిలో దిగలేదు. జక్కల చెరువు వద్దకు రాగానే మెలుకువ రావటంతో రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించగా, అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన నిరంజన్ ను రైల్వే సిబ్బంది గుత్తి ఆసుపత్రికి తరలించారు.
రైలు దిగే ప్రయత్నంలో,కాళ్లు పోగొట్టుకున్న యువకుడు
కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించి ఓ విద్యార్థి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. అనంత జిల్లా జక్కల చెరువు సమీపంలో ఈ ప్రమాదం జరగగా,బాధితుడు తాడిపత్రికి చెందిన నిరంజన్ గా గుర్తించారు.
రైలు నుంచి దిగేందుకు యత్నం... రెండు కాళ్లు విరిగిన వైనం