మధురై ప్రాంతానికి చెందిన యువకుడు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఖానా సింగ్ అనే 22 ఏళ్ల యువకుడు ఉపాధి నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం వచ్చాడు. ఆదిమూర్తి నగర్ లో నివాసం ఉంటున్నాడు.
ప్రింటింగ్ ప్రెస్ దుకాణంలో ఖానా సింగ్ పనిచేసేవాడు. కరోనా సమయంలో మధురైకి వెళ్లి ఈ మధ్య కాలంలోనే తిరిగి అనంతపురం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉండేవాడని అన్నారు .
ఇవాళ సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ఉరితాడుకు వేలాడుతున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తమకు తెలియదని కుటుంబ సభ్యలు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు.
ఇదీ చదవండి:ADAVISESH: దిశ యాప్‌తో మహిళలకు ఎంతో రక్షణ..: నటుడు అడవి శేషు