ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కళ్యాణదుర్గంలో విద్యార్థినిని కాపాడిన పోలీసు అధికారి' - అనంతపురం జిల్లా

విధుల్లో భాగంగా సీఐ గస్తీ తిరుగుతున్నారు. అదే సమయంలో ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. సమాచారం తెలుసుకున్న అధికారి తన వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో పోలీసు అధికారి స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

'కళ్యాణదుర్గంలో విద్యార్థిని కాపాడిన పోలీసు అధికారి'

By

Published : Sep 24, 2019, 12:06 AM IST

'కళ్యాణదుర్గంలో విద్యార్థిని కాపాడిన పోలీసు అధికారి'

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈషా ప్రియా అనే విద్యార్థిని 10వ తరగతి చదువుతోంది. ఉన్నట్టుండి కడుపునొప్పితో తీవ్ర అస్వస్థకు గురయ్యింది. అదే సమయంలో కళ్యాణదుర్గం పట్టణ సీఐ సురేష్ బాబు విధుల్లో భాగంగా గస్తీ తిరుగుతున్నారు. పాఠశాల దగ్గరికి వచ్చిన పోలీసు అధికారికి విద్యార్థులు విలపిస్తుండటం కనిపించింది. వెంటనే స్పందించిన సీఐ స్వయంగా తన వాహనంలో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థిని కోలుకుని తనతో మాట్లాడిన అనంతరం సీఐ ఆసుపత్రినుంచి బయటకి వెళ్లారు. సకాలంలో పోలీసు అధికారి స్పందించినందుకు పాఠశాల సిబ్బంది, విద్యార్థిని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ సురేశ్​ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details