ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలల రక్షణ.. కెమెరాల వీక్షణ! - అనంతపురంజిల్లా ముఖ్య వార్తలు

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఆదేపల్లి గ్రామంలో కర్ణాటకకు చెందిన వినయ్‌ అనే రైతు 22 ఎకరాలను లీజుకు తీసుకుని దానిమ్మ సాగు చేపట్టారు. పక్షుల బెడద ఎక్కువగా ఉండటంతో రూ.5 లక్షల వ్యయంతో పే..ద్ద వలను కొని దానిమ్మ చెట్ల పైనుంచి మొత్తం తోట అంతా కప్పేశారు.

వలల రక్షణ.. కెమెరాల వీక్షణ!
వలల రక్షణ.. కెమెరాల వీక్షణ!

By

Published : Oct 3, 2021, 4:59 AM IST

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఆదేపల్లి గ్రామంలో కర్ణాటకకు చెందిన వినయ్‌ అనే రైతు 22 ఎకరాలను లీజుకు తీసుకుని దానిమ్మ సాగు చేపట్టారు. పక్షుల బెడద ఎక్కువగా ఉండటంతో రూ.5 లక్షల వ్యయంతో పే..ద్ద వలను కొని దానిమ్మ చెట్ల పైనుంచి మొత్తం తోట అంతా కప్పేశారు. ఇక తరచూ తోట వద్ద ఉండలేక సుమారు రూ.1.5 లక్షలతో 8 సీసీ కెమెరాలను క్షేత్రం చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడి నుంచైనా తోట చూసుకునేందుకు వీలుగా నేరుగా ఫోన్‌కే కెమెరాల ఫుటేజీని అనుసంధానం చేయించుకున్నారు. కాస్త ఖర్చయినా తోట మొత్తం నిత్యం కళ్ల ముందే కదలాడుతోందని, భద్రత పరంగా చింత లేదని రైతు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details