అనంతపురం జిల్లా గుంతకల్లులో డీఎస్పీసీఐ ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు సోదాలు చేశారు. రూ.50 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను మిల్లు ఏరియాలో గుర్తించిపట్టుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఈ సరకు రాష్ట్రంలోకి వచ్చిందని పోలీసులు తేల్చారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే నాన్-బెయిలబుల్ కేసు నమోదై 10ఏళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
రూ.50 వేల విలువైన గుట్కా పట్టివేత - గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్లులోని మిల్లు ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.50 వేల విలువైన గుట్కా పట్టివేత