తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ అధికారం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని అనంతపురం పట్టణ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని గుత్తిరోడ్డు సమీపంలో ఉన్న 500 వైకాపా అభిమాన కుటుంబాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనేడు తెదేపాలోచేరాయి. వారికి తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రభాకర్అన్నారు. సంక్షేమ పథకాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తామన్నారు.