ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్మార్ట్​ఫోన్లను ఇస్మార్ట్​గా దోచేశారు! - ananthapur district

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఓ సెల్​ఫోన్​ దుకాణంలో సుమారు 2 లక్షల విలువ చేసే స్మార్ట్​ఫోన్​ల దోపిడీ జరిగింది. ఉదయం షాపు తెరిచిన అనంతరం.. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉంటాన్ని గమనించిన యజమాని పోలీసులను ఆశ్రయించాడు.

స్మార్ట్​ఫోన్లను ఇస్మార్ట్​గా దోచేశారు

By

Published : Aug 14, 2019, 10:16 PM IST

స్మార్ట్​ఫోన్లను ఇస్మార్ట్​గా దోచేశారు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చరవాణుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. స్థానిక ఫుట్​బాల్​ మైదానం సమీపంలోని ఇంటర్​ నేషనల్​ షాపు వెనుక వైపు భాగాన గోడకు రంధ్రం చేసిన దొంగలు.. లోనికి చొరబడ్డారు. 2 లక్షల విలువ చేసే 25 స్మార్ట్​ఫోన్​లను దోచుకెళ్లారు. షాపు యజమాని ఉదయాన్నే దుకాణం తెరచి చూసేసరికి వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్​ టీమ్​ బృందం వేలిముద్రలు సేకరించింది. ఘటనపై గుత్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details