రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతపురంలోని చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద 11 మంది ఆ నదిలో చిక్కుకుపోయారు. వాయుసేన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
హెలికాఫ్టర్తో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్.. 11మంది సేఫ్ - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లాలో వాయుసేన సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని హెలీకాఫ్టర్ సహాయంతో కాపాడారు. వాయుసేన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
11 people trapped in Chitravati river rescued by Indian Air Force