ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతపై .. ఉన్నతాధికార్లపై అయ్యన్న కుమారుడు ప్రైవేట్ కేసు దాఖలు

AYYANNA SON RAJESH FILE CASE ON ASP AND RDO: 2022 జూన్​ 18 అర్ధరాత్రి.. ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన ఘటనలో నర్సీపట్నం న్యాయస్థానంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల రాజేశ్‌ ప్రైవేటు కేసు వేశారు.

AYYANNA SON RAJESH FILE CASE ON ASP AND RDO
AYYANNA SON RAJESH FILE CASE ON ASP AND RDO

By

Published : Jan 23, 2023, 7:51 PM IST

AYYANNA SON FILE CASE ON ASP AND RDO : ఇంటి ప్రహరీ కూల్చివేత ఘటనలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం న్యాయస్థానంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల రాజేశ్‌ ప్రైవేటు కేసు వేశారు. ఏఎస్పీ, ఆర్డీవో సహా 14 మందిపై ప్రైవేట్ కేసు వేశారు. అయ్యన్న పాత్రుడు కొత్త ఇంటి నిర్మాణంలో జల వనరుల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణపై గతేడాది జూన్ 19వ తేదీ తెల్లవారుజామున ప్రహరీ కూల్చి వేశారు.

అసలేం జరిగింది:అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు.. పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. 2022 జూన్​ 18న అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ.. మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు.

జూన్​ రెండో తేదీతో ఉన్న నోటీసును జూన్​ 18న ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు.. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆర్డీవో మణికంఠ.. అయ్యన్నపాత్రుడి ఇంట్లో పరిస్థితిని సమీక్షించారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్న పాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.

అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details