ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి వేణుగోపాలకృష్ణను బర్త్​​రఫ్ చేయాలి'

Minister Venugopalakrishna: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను బర్త్​​రఫ్ చేయాలని.. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు డిమాండ్ చేసింది. ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే... 2024 ఎన్నికల్లో సీఎం జగన్ తమను దూరం చేసుకోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.

By

Published : May 12, 2022, 8:14 AM IST

Settibalija Mahanadu
కుడుపూడి సూర్యనారాయణరావు

ఈ నెలాఖరులోగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రి పదవి నుంచి బర్త్​రఫ్​ చేయాలని... లేకపోతే 2024 ఎన్నికల్లో తమను దూరం చేసుకోవాల్సి వస్తుందని సీఎం జగన్​కు... ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అల్టిమేటమ్ ఇచ్చారు. అమలాపురంలో శెట్టిబలిజలతో.. ఆ సంఘం కన్వీనర్ సూర్యనారాయణరావు భేటీ అయ్యారు. మంత్రి వేణుగోపాలకృష్ణ.. శెట్టి బలిజ సామాజిక వర్గం పరువు తీస్తూ తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లడం సహించరానిదని మండిపడ్డారు.

కుడుపూడి సూర్యనారాయణరావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details