One Hundred Ganja Smugglers Arrested : గంజాయి.. ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో సాధారణ పంటగా సాగు చేసే గంజాయిని.. విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తూ ఆర్థిక నేరాలకు మూలంగా మారింది ఈ ప్రాంతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల గంజాయి పట్టుబడినా.. ఆ ఘటన నర్సీపట్నం పోలీసు సబ్ డివిజన్‌తో ముడిపడే ఉంటుంది. అందుకే మన్యం ముఖ ద్వారంగా పేరుగాంచిన నర్సీపట్నం గంజాయి ప్రాబల్య ప్రాంతంగా ప్రసిద్ధి చెంది దేశంలోనే ఒక గుర్తింపు పొందింది. అయితే ఇదంతా ఒకప్పటిమాట. తాజాగా గంజాయి అక్రమ రవాణా నేరాలకు సంబంధించిన ఘటనలను కట్టడి చేసేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా పోలీసు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
దీనిలో భాగంగా పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు సంబంధం ఉన్న గ్రామాలపై ప్రత్యేక ఉంచి దృష్టి సారిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్లోని రోలుగుంట మండలంలో.. బీబీ పట్నం, రత్నంపేట, ఎంకే పట్నం, బుచ్చంపేట వంటి పంచాయతీలు గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ఒక్క బేబీ పట్నం గ్రామం నుంచే సుమారు 110మందికి పైగా గంజాయి నేరస్థులను గుర్తించి.. వారి ఏరివేతకు ప్రత్యేక ప్రణాళికను పోలీసులు రూపొందించారు.
Two Arrested in 205 Ganja Seized Case at Pendurthi: అద్దె ఇంట్లో గంజాయి వ్యాపారం.. ఇద్దరు అరెస్టు.. మరో ఇద్దరి కోసం వేట
వివిధ గంజాయి కేసులు నమోదై పరారీలో ఉన్న సుమారు 110 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో వారు తలదాచుకుంటున్నారన్న సమాచారాన్ని సేకరించి ఇటీవలే వారందరినీ అరెస్టు చేశారు. ఇందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి రోలుగుంట పోలీసులకు అదనపు బాధ్యతలు అప్పగించి నిందితుల ఏరివేతలో సఫలీకృతం అవుతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో గంజాయి అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు పోలీసు దాడుల్లో టన్నులకొద్ది దొరికే గంజాయి అక్రమ రవాణా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రోలుగుంట పోలీసులు పేర్కొంటున్నారు.
"అనకాపల్లి జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు మేము ముమ్మరంగా కసరత్తు చేశాము. దీనిలో భాగంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధం ఉన్న గ్రామాలపై ప్రత్యేక ఉంచి దృష్టి సారించాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్లోని రోలుగుంట మండలంలో.. బీబీ పట్నం, రత్నంపేట, ఎంకే పట్నం, బుచ్చంపేట వంటి పంచాయతీలు గంజాయి రవాణాలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. వీటిలో ఒక్క బేబీ పట్నం గ్రామం నుంచే సుమారు 110మందికి పైగా గంజాయి నేరస్థులను గుర్తించి.. వారి ఏరివేతకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి.. సుమారు 100 మంది నిందితులను అరెస్టు చేశాం." - బి.నాగ కార్తీక్, అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎస్సై
Ganja Gang Arrested in Anantapur District: అనంతపురం, బాపట్ల జిల్లాల్లో భారీగా గంజాయి పట్టివేత..18మంది అరెస్ట్