ELAMANCHILI MLA KANNABABU : ఎలమంచిలి ఎమ్మెల్యే యువీ రమణ మూర్తి రాజు (కన్నబాబు) నియోజవర్గంలోని స్థానిక విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించారు. పళ్లు పీకేస్తానంటూ విద్యార్థి పైకి దూసుకెళ్లారు. నాయకులు, స్థానికులు అడ్డుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారమంతా వీక్షించిన స్థానికులు ఎమ్మెల్యే తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఈ కార్యక్రమం సాఫీగా సాగుతున్న చాలా చోట్ల ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసనలు, అడ్డగింతలు తప్పటం లేదు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాలలోని ప్రజలు.. ఎమ్మెల్యేలు వారి వద్దకు రాగానే అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులాపల్లిలో చోటు చేసుకోగా.. ఎలమంచిలి ఎమ్మెల్యే విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించారు.
అసలు ఏం జరిగిందంటే :జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలోని నాగులాపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే యువీ రమణ మూర్తి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తు ముందుక సాగుతున్న క్రమంలో గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లి.. అక్కడ ఉన్న విద్యార్థినిని అమ్మ ఒడి అందిందా అని అడిగారు. ఆమె అందింది అని సమాధానం ఇవ్వటంతో.. అక్కడే ఉన్న మరో విద్యార్థిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా మళ్ల శంకర్ అనే ఆ విద్యార్థి నగదు తనకు అందలేదని తెలిపాడు.