Lokesh Yuvagalam Padayatra in Anakapalli: అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఎలమంచిలి కొత్తూరు క్యాంప్ సైట్ నుంచి 222వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అడ్డగోలుగా దోచుకోవడమే పనిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే బెదిరింపులు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నవ్యాంధ్రలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని రివర్స్ ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగులను ముంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతందని లోకేశ్ మండిపడ్డారు.
బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్: ఎలమంచిలిలో విశ్రాంత ఉద్యోగులతో యువనేత సమావేశమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మొదటి బాధితులు ఉద్యోగులేనని లోకేశ్ చెప్పారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి నేడు ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డుపైకి నెట్టిందని విమర్శించారు. నవ్యాంధ్రలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని లోకేష్ చెప్పారు. రివర్స్ ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగులను ముంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతందని లోకేశ్ మండిపడ్డారు.
దుగ్గిరాలలో యువరైతు ఆత్మహత్య - వైసీపీ సర్కార్ తీరుపై చంద్రబాబు, లోకేశ్ ధ్వజం