Head Master Corruption in Nadu Nedu Funds :సర్కార్ సొత్తు అంటే అందరికీ లోకువే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను నీరు గారుస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పలు అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నంలో చోటు చేసుకున్ననాడు-నేడు నిధులస్వాహా వ్యవహారమే అర్థం పడుతుంది. ఈ గ్రామ జడ్పీ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు గాను మంజూరైన నాడు-నేడు నిధులలో అక్కడే ప్రధానోపాధ్యాయులు స్వాహా చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నాడు-నేడు పనుల్లో అక్రమాలు - పెద్ద మొత్తంలో ఇనుము, సిమెంట్ మాయం
HM Babji Rao Withdraw Nadu Nedu Funds :సుమారు 160 మంది విద్యార్థులు చదువుతున్న బీబీ పట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో కనీస మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం రెండో విడత నాడు-నేడులో సుమారు 62 లక్షల రూపాయలను మంజూరు చేసింది. వీటిలో 20 లక్షలకుపైగా విద్యార్థులకు కూర్చునేందుకు బల్లలు ఇతర ఫర్నిచర్కుగాను కేటాయింపు చేయగా మిగిలిన 42 లక్షల రూపాయలను తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుద్దీకరణ తదితర వసతుల కల్పనకు గాను వినియోగించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ముందు పాఠశాల విద్యా కమిటీ తీర్మానాలను ఆమోదించి వాటి ప్రకారం చేపట్టాల్సి ఉంది. అయితే ఇక్కడ జూన్ నెల వరకు విధులను నిర్వహించిన హెచ్ఎం బాబ్జీరావ్ కమిటీ తీర్మానాలు లేకుండా, చైర్మన్ ప్రమేయం లేకుండా కొంత నగదు డ్రా చేశారు. హెచ్ఎం బాబ్జీరావ్ ఈ ఏడాది జూన్ 8వ తేదీన మరోచోటకు బదిలీ అయ్యారు.