A key decision of the Central Election Commission: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓ శుభవార్తను చెప్పింది. వలస వెళ్లిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అంటే పోలింగ్ రోజున ఓటు వేసేందుకు సొంత రాష్ట్రాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, ఈ రిమోట్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గ సుదూర ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ప్రోటో టైప్‌ను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. వారి కోసం రిమోట్ ఓటింగ్ సదుపాయం - వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి శుభవార్త
A key decision of the Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి శుభవార్తను చెప్పింది. వలస వెళ్లిన వారికోసం రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని కలిగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
2023 జనవరి 16వ తేదీన ఎనిమిది జాతీయ పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 57 ప్రాంతీయ పార్టీలను కూడా ఈసీ ఆహ్వానించినట్టు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రోటో టైప్ రిమోట్ ఓటింగ్ మెషీన్‌ను అన్ని పార్టీల ప్రతినిధులకు ప్రదర్శించి చూపిస్తారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా ఓటర్లు వివిధ కారణాలతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని, పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు వీలుగా ఈ రిమోట్ ఓటింగ్ ప్రక్రియ ఉపకరిస్తుందని ఈసీ తెలిపింది.
పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఆయా రాష్ట్రాల నుంచే రిమోట్ ఓటింగ్ మెషిన్ ద్వారా ఓట్లను వేసేందుకు అస్కారం ఉందని ఈసీ పేర్కొంది. అయితే ఇందులో న్యాయపరమైన, పాలనాపరమైన, సాంకేతికపరమైన సవాళ్లను అధిగమించేందుకు కొన్ని చట్ట సవరణలు చేయాల్సి ఉందని తెలిపింది. ఈ అంశాలను కూడా రాజకీయ పార్టీలకు పంపి, వారి అభిప్రాయాలను కోరుతున్నామని, ఈ రిమోట్ ఓటింగ్ మెషీన్ వినియోగంపై జనవరి 31లోగా అన్ని రాజకీయ పార్టీలు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియచేయాల్సిందిగా ఈసీ కోరింది.