Army Jawan Died: అనకాపల్లి జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చీడికాడ మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ ఆర్మీ జవాన్.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన మధుమంతి మహేశ్ అనే వ్యక్తి ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. డ్యూటీలో భాగంగా తోటి ఆర్మీ ఉద్యోగులతో కలిసి దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ప్రత్యేక వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ట్రాఫిక్ అధికంగా ఉంది. దీంతో ఆయన వాహనం దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా.. అధిక వేగంతో ప్రయాణిస్తున్న ఓ బైక్ మహేశ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన మహేశ్‌ను తోటి ఆర్మీ ఉగ్యోగులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మహేశ్ మృతి చెందిన సమాచారాన్ని ఆర్మీ ఉన్నత అధికారులు.. ఆయన కుటుంబ సభ్యులకు అందించారు.
కాగా.. మహేశ్‌కు ఇటీవలే వివాహమైంది. మాకవరపాలెం మండలానికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదిన వివాహం జరిగింది. వివాహమైన తర్వాత నెల రోజుల పాటు మహేశ్ గ్రామంలోనే ఉన్నారు. సెలవుల అనంతరం ఇటీవలే మహేశ్ రక్షణ రంగంలో విధి నిర్వహణకు వెళ్లారు. వివాహమై రెండు నెలలు కాకుండానే మహేశ్‌ను బైక్ రూపంలో మృత్యువు కబళించింది. పారాణి ఆరకముందే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. మహేశ్ మృతితో ఆయన భార్య, తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో ఆ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మహేశ్ పార్థివ దేహం ఆయన గ్రామానికి చేరే అవకాశం ఉంది.
పిడుగుపాటుకు మహిళ మృతి..గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండల కేంద్రంలో పిడుగుపాటుకు గురై శనివారం ఓ పశువుల కాపరి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరికల జోజప్ప భార్య జ్యోతి(45) గేదెలు కాచేందుకు శుక్రవారం గ్రామ పరిధిలోని పొలానికి వెళ్లింది. అయితే మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పశువులను మేతకు తీసుకువచ్చిన వారందరూ పొలం సమీపంలోని ఓ చెట్టు వద్దకు చేరుకున్నారు.