పోలవరంపై కేవీపీ కేసు విచారణ వాయిదా - central
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున వ్యయం మొత్తం కేంద్రమే భరించేలా ఆదేశించాలని కోరుతూ 2017లో కాంగ్రెస్ నేత కేవీపీ వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కనుక నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సొమ్ము తిరిగి చెల్లించటంలేదని కోర్టుకు విన్నవించారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించాలని కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరుపున ఏఎస్జీ వాదిస్తూ ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఆసక్తిగా ఉందని తెలిపారు.